AP DSC Recruitment : గుడ్ న్యూస్... ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల - నవంబరు 3 నుంచి దరఖాస్తులు, జిల్లాల వారీగా ఖాళీలివే

AP DSC 2026 Recruitment Notification : 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబరు 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

Published on: Oct 14, 2026, 07:23:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP DSC 2026 Recruitment Notification : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మంగళవారం రాత్రి డీఎస్సీ-2026 ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం విద్యాశాఖ వేర్వేరు ప్రకటనలను జారీ చేసింది.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్

ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో 2,111 జనరల్ టీచర్ పోస్టులను (స్కూల్ అసిస్టెంట్లు 906, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,205) భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 350 ప్రత్యేక ఉపాధ్యాయ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను, వివిధ సొసైటీల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరీల్లో 260 పోస్టులను నింపనున్నారు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్య పరిధిలో ఉన్న 2,111 పోస్టుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 389 ఖాళీలు ఉన్నాయి (సాధారణ, ప్రత్యేక పోస్టులు కలిపి 404). ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం జిల్లాలో 266 ఖాళీలు, కడప జిల్లాల్లో 206 ఖాళీలన్నాయి.

అనంతపురం జిల్లాలో 92, నెల్లూరులో 165, చిత్తూరులో 130, తిరుపతిలో 99 పోస్టులను రిక్రూట్ చేస్తారు. అతి తక్కువగా విజయనగరంలో 4, పార్వతీపురం మన్యంలో 8, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

ఇక వివిధ సంక్షేమ సొసైటీలు, ఆదర్శ పాఠశాలల పరిధిలో మొత్తం 260 పోస్టులను కేటాయించారు. వీటిలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనే 85 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తుండగా….. పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్‌గా పరిగణిస్తారు. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ పోస్టులను ఇటీవలే ప్రభుత్వం స్థానిక కేడర్ పోస్టులుగా వర్గీకరించింది.

నవంబర్ 3 నుంచి దరఖాస్తులు….

ఈ నియామకాలకు సంబంధించి నవంబరు 3 నుంచి అధికారిక పోర్టల్ ( https://tet2dsc.apcfss.in ) ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. పూర్తి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా రోస్టర్లు, రిజర్వేషన్లు, వయోపరిమితి, విద్యార్హతలు మరియు పరీక్షా తేదీల సమాచారాన్ని సమగ్రంగా వెల్లడిస్తారు. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More