ఆంధ్రప్రదేశ్‌లో మరో గోల్డ్ మైన్.. కేజీఎఫ్ రేంజ్ నిక్షేపాలు.. వేలం వేసేందుకు సిద్ధం!

చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనాథం బంగారు గనుల బ్లాక్ కోసం కొత్త వేలం ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కోలార్ షిస్ట్ బెల్ట్‌లో కీలకమైన ప్రదేశంలో ఉండటం, అధిక నాణ్యత గల నిల్వలను కలిగి ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.

Published on: Jun 25, 2026, 09:50:01 IST
By , Chittoor
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, ఖనిజ సంపదను వెలికితీసే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని గోల్డ్ మైనింగ్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనాథం బంగారు బ్లాక్ (Chigurgunta-Bisanatham Gold Block)ను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

ఏపీలో మరో గోల్డ్ మైన్
ఏపీలో మరో గోల్డ్ మైన్

చిత్తూరు జిల్లా పరిధిలోని ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత కీలకమైన బంగారు నిక్షేపాలు కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ప్రసిద్ధ కోలార్ స్కిస్ట్ బెల్ట్ పొడిగింపులోనే ఈ చిగురుకుంట-బిసనాథం బ్లాక్ ఉంది. ఇక్కడి గనుల్లో లభ్యమయ్యే బంగారం అత్యంత నాణ్యమైనదిగానిపుణులు తేల్చారు.

గతంలో ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు సాగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల నిలిచిపోయాయి. ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో ఈ నిక్షేపాలను వెలికితీస్తే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం రావడంతో పాటు స్థానికులకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మరోవైపు, రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు నూతనోత్తేజం ఇస్తూ కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి బంగారు గని వద్ద జూన్ 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మైనింగ్ ప్లాంట్ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.

జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి స్వదేశీ బంగారు గనుల ప్రాజెక్టుగా జొన్నగిరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా పెద్ద ఎత్తున బంగారాన్ని శుద్ధి చేయనున్నారు.

జొన్నగిరి ప్లాంట్ ద్వారా ఏపీలో మైనింగ్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న ఖనిజ నిక్షేపాలపై అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారించే అవకాశం ఉంది. చిగురుకుంట-బిసనాథం గనుల వేలం కూడా పూర్తయితే, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద బంగారు ఉత్పాదక రాష్ట్రంగా అవతరించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More