...
...
Next Story

ఏపీలో ఆస్ట్రేలియా మాదిరి చట్టం - 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా బ్యాన్ చేస్తారా..?

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌ పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ… ఈ కామెంట్స్ చేశారు.

Published on: Jan 22, 2026, 17:56:08 IST
Advertisement

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించింది. ఇదే మాదిరి నిర్ణయం ఏపీలో కూడా అమలు కానుందా..? అక్కడ తీసుకువచ్చిన సంస్కరణలను ఇక్కడ కూడా పరిశీలిస్తున్నారా..? అనే ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్వయంగా ఈ విషయంపై దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా బ్యాన్...? 
 (Representative image) (iStock)
సోషల్ మీడియా బ్యాన్...? (Representative image) (iStock)

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవలే నిషేధం విధించిందని లోకేశ్ గుర్తు చేశారు. ఇలాంటి సంస్కరణలను ఏపీలో కూడా అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పారు. దావోస్‌లో బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడిన లోకేశ్… ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఒక రాష్ట్రంగా.. మేము కూడా ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని అధ్యయనం చేస్తున్నాం. చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను" అని నారా లోకేష్ చెప్పారు.

‘‘ఒక నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉన్న యువకులు అలాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉండకూడదు. ఎందుకంటే వారు బహిర్గతం చేసే కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేరు.బలమైన, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ అవసరం కావొచ్చు. ఆ దిశగా మేం ఆలోచిస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లల కోసం టిక్ టాక్, ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్ మరియు థ్రెడ్స్ ను నిషేధించింది. డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సదరు కంపెనీలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు కనీసం 16 సంవత్సరాలు అని ధృవీకరించడానికి "సహేతుకమైన చర్యలు" తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై జరిమానాలు ఉంటాయి. కొన్ని ఫ్లాట్ ఫామ్స్ కు మాత్రం ఈ ఆంక్షల నుంచి మినహాయించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe