గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి.. జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్

గ్రీన్ అమ్మోనియో తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని జెరా గ్లోబల్ సీఈవో యుకియో కానితో మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ జెన్కో, ఎన్టీపీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలన్నారు.

Published on: Jan 21, 2026, 18:51:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో భేటీ అయ్యారు. జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాని కోరారు. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర-పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు.

జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్ భేటీ
జెరా గ్లోబల్ సీఈవోతో లోకేశ్ భేటీ

'విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవుల నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్‌లు పునరుత్పాదక ఇంధన వనరులు, LNG/ లో- కార్బన్ అమ్మోనియా మౌలిక సదుపాయాలు, తయారీని సహ-స్థాపనకు అనుమతిస్తాయి. ఇక్కడ జెరా యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌లను రూపొందించండి. గ్రిడ్ విశ్వసనీయతను కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి, కాలక్రమేణా అమ్మోనియా కో ఫైరింగ్‌ను పరీక్షించడానికి, థర్మల్ ప్లాంట్లలో పైలట్ ప్రాజెక్టులను అంచనా వేయడం, రూపొందించడంలో ఏపీ జెన్కో, ఎన్టీపీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలి.' అని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

యుకియో కాని మాట్లాడుతూ... జపాన్ భవిష్యత్తు క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చైన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ తో భాగస్వామ్యం ద్వారా యుటిలిటీ-స్కేల్ పునరుత్పాదక శక్తి తయారీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు వెల్లడించారు. పునరుత్పాదక శక్తితో పాటు ఎల్ఎన్ జీ ఆధారిత విద్యుత్ పరివర్తన, గ్రిడ్-బ్యాలెన్సింగ్ పరిష్కారాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని యుకియో కాని పేర్కొన్నారు.

'జపాన్ ఇంధన దిగ్గజం జెరా గ్లోబల్ సీఈఓ అండ్ చైర్ యుకియో కానిని దావోస్‌లో కలవడం చాలా ఆనందంగా ఉంది. జపాన్, ఆసియా మార్కెట్లకు సేవలందించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు ఆధారిత పారిశ్రామిక క్లస్టర్‌ల సమీపంలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టమని నేను జెరాను ఆహ్వానించాను. రాయలసీమలో సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌లు, గ్రిడ్ విశ్వసనీయతను నిర్ధారిస్తూ ఉద్గారాలను తగ్గించడానికి ఏపీజెన్‌కో అండ్ ఎన్‌టీపీసీతో అమ్మోనియా కో-ఫైరింగ్‌పై పైలట్‌లను కూడా మేం చర్చించాం.' అని ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More