ఏపీ రైతులకు అలర్ట్ - ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం, 48 గంటల్లోనే డబ్బులు జమ..!

ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈసారి ఖరీఫ్ సీజన్ లో 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.

Published on: Oct 18, 2025, 13:00:22 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2025-26 ఖరీఫ్ పంట కొనుగోళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు ఈనెల 27వ తేదీని ఖరారు చేసింది. ఈ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం (ఫైల్ ఫొటో)
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం (ఫైల్ ఫొటో)

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం… 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి మాత్రం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమ్మిళితంగా పనిచేయడానికి… సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి నాదెండ్ల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి సమిష్టి కృషి చేయాలని మంత్రి నాదెండ్ల కోరారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు. రైతుల కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

48 గంటల్లో డబ్బులు జమ - మంత్రి నాదెండ్ల

మొత్తం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 సహకార సంఘాల ద్వారా ధాన్యం సేకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు.

1:2 విధానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటామని… 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ రైస్‌మిల్లర్లకు సూచించారు. జిల్లాల్లో రియల్ టైమ్ మానిటరింగ్ అమలు చేస్తామని మనోహర్ తెలిపారు. తేమను కొలిచే యంత్రాలు, రవాణా సౌకర్యాలు మరియు నాణ్యమైన గోనె సంచుల సంసిద్ధతను ముందుగానే నిర్ధారించుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు వాట్సప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని హాయ్‌ అనే సందేశం పంపి నమోదు చేసుకోవచ్చుని కూడా సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More