ఆంధ్రప్రదేశ్ : ప్రభుత్వాస్పత్రుల్లో కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు - తొలి విడతలో ఎక్కడెక్కడంటే..?

రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.

Published on: Jun 23, 2026, 08:35:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వికలాంగులు, బాధితులకు బాసటగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను (ఆర్టిఫిషియల్ ఆర్గాన్ మేకింగ్ యూనిట్స్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్లు, శ్రవణ పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్) వంటి సహాయక పరికరాలను నేరుగా అందిస్తారు.

ఏపీలో ఐదు బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు
ఏపీలో ఐదు బోధనా ఆసుపత్రుల్లో కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలు

రాష్ట్రంలో ఇలాంటి ప్రత్యేక విభాగాలను తీసుకురావడం ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల సూచనల మేరకు… వికలాంగులకు నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులను ఉచితంగా అందించడం ద్వారా వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

5 ఆస్పత్రుల్లో కేంద్రాలు…

మొదటి విడత కింద రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో (జీజీహెచ్) ఈ తయారీ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం నగరాలలోని ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు ఈ మొదటి విడత జాబితాలో ఉన్నాయి.

రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలోని మొత్తం 27 జిల్లాల్లోనూ జిల్లాకు ఒకటి చొప్పున కృత్రిమ అవయవ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

సీఎం విజ్ఞప్తికి కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో….. తొలి దశలో భాగంగా ఈ ఐదు ప్రధాన బోధనా ఆసుపత్రుల్లో యూనిట్ల ఏర్పాటుకు మార్గం సుగమమైందని ఆయన వివరించారు. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే వేలాది మంది వికలాంగులకు స్థానికంగానే అత్యాధునిక కృత్రిమ అవయవాలు లభిస్తాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More