...
...
Next Story

AP Assembly : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - సభకు వైసీపీ ఎమ్మెల్యేలు..!

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

Published on: Feb 11, 2026 06:11 AM IST
Advertisement

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. ఇందులో బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించిన అజెండాను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా సభను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.

ఈనెల 14న బడ్జెట్…!

ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

సభకు రావాలని వైసీపీ నిర్ణయం…

మరోవైపు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించారు. తామంతా అసెంబ్లీ సమావేశానికి వెళుతున్నామని… గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైసీపీ సభ్యులు చివరిసారిగా 2025 ఫిబ్రవరి 24న సభకు హాజరయ్యారు.వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు.

ఈ బడ్జెట్‌ సెషన్‌లో ఒక్కరోజు మాత్రమే వైసీపీ సభ్యులు అసెంబ్లీలో కనిపించే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ వెళ్లడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాలకు మాత్రమే వెళ్లిన వైసీపీ ప్రమాణస్వీకారం చేసి వచ్చేశారు. తర్వాత జరిగిన సమావేశాలకు వైసీపీ మొదటిరోజు వెళ్లి బాయ్ కట్ చేస్తున్నారు. ఈసారి కేవలం గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటారా..? లేక సెషన్ మొత్తం పాల్గొంటారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డి.జి.పి.హరీష్ కుమార్ గుప్తను ఆదేశించారు. సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని,వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అంతేగాక అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార,సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు.ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు,సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీస్ అధికారులకు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe