అవయవాల దానoలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ( కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అపెక్స్ బాడీ ) రాష్ట్రాల వారీగా అవయవ దానo జాబితా-2025ను ప్రకటించింది. రాష్ట్ర విభజన తరువాత 2015లో ఏర్పాటు అయిన జీవన్ దాన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తుందన్నారు.

ఇటీవల హైకోర్టు ప్రభుత్వాసుపత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సల గురించి ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలో మంత్రి సత్య కుమార్ వైద్య ఆరోగ్య, జీవన్ దాన్ ట్రస్ట్ అధికారులతో సమీక్ష జరిపారు. అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగే ఆసుపత్రుల సంఖ్య మూడు నుంచి తొమ్మిదికి పెరిగిందన్నారు ఈ జాబితాలో వైజాగ్ కేజీహెచ్, విమ్స్, గుంటూరు జీజీహెచ్, కర్నూలు జీజీహెచ్, తిరుపతి స్విమ్స్, మంగళగిరి ఎయిమ్స్, పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్-తిరుపతి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస, జీజీహెచ్ విజయవాడ ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.
అలాగే కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, అనంతపురం, వైయస్సార్ కడప, తిరుపతి ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి అవయవాల తొలగింపు, ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన అనుమతులు ఇచ్చామని జీవన ట్రస్ట్ కోఆర్డినేటర్ రాంబాబు.. మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చూడాలని, పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖలోని కేజీహెచ్, విమ్స్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వాసుపత్రి ద్వారా ఇప్పటి వరకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు నుంచి ఎనిమిది కిడ్నీలు, ఒక లివర్ మార్పిడి చేయగా రక్తసంబంధీకుల నుంచి 87 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్లు అధికారులు వివరించారు. తాజాగా విజయవాడ శివారులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండెను స్వీకరించి గుండె మార్పిడి విజయవంతంగా పూర్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రెండు నెలల కాలంలో 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 64 అవయవాలు స్వీకరించి 64 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది గడిచిన రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే గణనీయంగా అవయవ దాన కేసులు పెరుగుతున్నాయి అనటానికి నిదర్శనం అన్నారు మంత్రి సత్యకుమార్. గత ఏడాది మొదటి రెండు నెలల్లో 12 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 31 అవయవ దాన మార్పిడి జరిగితే, 2024 లో 10 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తులు నుంచి సహకరించిన 30 అవయవాల మార్పిడి జరిగాయన్నారు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రెండు నెలల కాలంలో 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 64 అవయవాలు స్వీకరించి 64 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది గడిచిన రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే గణనీయంగా అవయవ దాన కేసులు పెరుగుతున్నాయి అనటానికి నిదర్శనం అన్నారు మంత్రి సత్యకుమార్. గత ఏడాది మొదటి రెండు నెలల్లో 12 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 31 అవయవ దాన మార్పిడి జరిగితే, 2024 లో 10 మంది బ్రెయిన్ డెడ్ వ్యక్తులు నుంచి సహకరించిన 30 అవయవాల మార్పిడి జరిగాయన్నారు.
{{/usCountry}}1200 మంది బాధితులకు రాష్ట్ర జీవన్ దాన్ నూతన జీవితాలను ప్రసాదించిందని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించి బాధితులకు అండగా నిలుస్తూ వారి జీవితాలకు కొత్త వెలుగులు నింపిందన్నారు మంత్రి. గత ఏడాది కాలంలోనే 301 మంది బాధితులకు నూతన జీవితాలను ప్రసాదించి సరికొత్త చరిత్రను రాష్ట్ర జీవన్ దాన్ సృష్టించింది అని పేర్కొన్నారు..
రాష్ట్రంలో 20-50 ఏళ్ల వయసు మధ్యలో ఎక్కువ మంది అవయవాలు విఫలమై బాధపడుతున్నట్లు రాష్ట్ర జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా తెలిసిందన్నారు మంత్రి సత్యకుమార్. ట్రస్టులో ఇప్పటి వరకు 5347 మంది పలు అవయవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో అధికంగా యువకులే ఉండటం ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 0-09 ఏళ్లలోపు పిల్లలు 38 మంది ఉన్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను స్వీకరించే విధంగా వాళ్లకి గౌరవం కల్పించేడానికి జారీ చేసిన జీవో 95 ద్వారా అవయవ దానం చేసిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కరణలు జరుగుతున్నాయని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అలాగే అవయవదాత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆర్థిక సాయం రూ.లక్ష వరకు పెంచే విషయo ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.