Andhrapradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే నెల మధ్యకు చేరుకోవడంతో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
తీవ్ర వడగాలుల ముప్పు…

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం ప్రమాదకరంగా మారుతోంది. ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం 28 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
- శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాలు.
- విజయనగరం జిల్లా : బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు.
- పార్వతీపురం మన్యం జిల్లా : బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలు తీవ్ర వడగాలుల బారిన పడే అవకాశం ఉంది.
- ఈ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 21 మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం బలంగా చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు…
ఆదివారం నాటి వాతావరణ వివరాలను పరిశీలిస్తే….. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని కంభంలో అత్యధికంగా 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం నాటికి ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది. మంగళవారం నాడు ఎండ తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 245 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు
మరోవైపు…. వేడి వాతావరణం మధ్యే రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కూడా కనిపిస్తోంది. దీని కారణంగా ఇవాళ పలు జిల్లాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}మరోవైపు…. వేడి వాతావరణం మధ్యే రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కూడా కనిపిస్తోంది. దీని కారణంగా ఇవాళ పలు జిల్లాల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}