Andhra Pradesh Telangana Weather Updates : తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు…. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.

దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్….
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీసిటీ, సత్యవేడు, తడ మరియు దాని పరిసర ప్రాంతాలలో రాబోయే 3 గంటల్లో అక్కడక్కడా తీవ్రమైన పిడుగులతో కూడిన ఈదురుగాలుల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా మరియు ఇతర జిల్లాల విషయానికి వస్తే విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, ప్రయాణాల్లో ఉన్నవారు మరియు తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలంగాణ వెదర్ రిపోర్ట్ :
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
{{/usCountry}}హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
{{/usCountry}}