...
...
Next Story

ఈ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ.. రైతుల ఖాతాల్లోకి రూ.7000

ఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలో అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Published on: Nov 17, 2025, 14:42:58 IST
Advertisement

ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడనున్నాయి. ఈ మేరకు తేదీ ఖరారైంది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో పడనున్నట్టుగా మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవం పథకం అమలుకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనుంది. అదే రోజు పీఎం కిసాన్ నిధులు కూడా పడనున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా సమీక్ష నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. 'ఈనెల 19వ తేదీన వైఎస్సాఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నారు. అర్హులైన రైతులు చనిపోతే వారి వారసులకు డెత్ మ్యూటేష్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం. ఎన్‌పీసీఏలో ఇన్ యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను వ్యవసాయ శాఖ అధికారులు యాక్టివేట్ చేయాలి.' అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని సులభతరం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత 46లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమకానున్నాయి. ఇందులో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు.

ఏపీ ప్రభుత్వం కేంద్ర పథకమైన పీఎం కిసాన్ యోజనను కూడా ఇందులో భాగం చేసి అమలు చేస్తోంది. దీంతో రైతుల ఖాతాల్లో రూ.7000 జమ అవుతున్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమైంది. 45 లక్షలకుపైగా రైతులు లబ్ధి పొందారు. రైతులకు పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ప్రారంభించిన ఈ పథకానికి మంచి స్పందన వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe