...
...
Next Story

AP Budget 2026 : ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..!

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలుకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. 14వ తేదీన పద్దును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Published on: Jan 28, 2026 08:30 PM IST
Advertisement

బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఏపీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ 2026-27ను రూపొందించే పనిలో ఉండగా…. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కసరత్తు పూర్తి చేసే పనిలో ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ్యులు ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజంతా ఈ తీర్మానంపై చర్చ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ ను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాదిరిగానే 2026-27 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారమైనా లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఆధారంగా పలు అంశాలపై కసరత్తు చేసే అవకాశం ఉంటుంది. ఏపీకి కేటాయించిన నిధులు, రాబోయే నిధులపై ఓ అంచనాకు వస్తుంది. దీని ఆధారంగా… కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా భాగం చేసుకునేలా పద్దును రూపకల్పన చేసే అవకాశం ఉంటుంది.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ భేటీల్లో చాలా నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. వీటిల్లో కొన్నింటికి శాసనసభ ఆమోదం తప్పనిసరి. అంతేకాకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపుతో పాటు అభివృద్ధి అంశాలపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇక పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై కూడా కీలకంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe