AP BRAGCET 2026 : ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ అప్డేట్ - ప్రాథమిక కీ విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రాథమిక కీ విడుదలైంది.  apbragcet.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 

Published on: Mar 16, 2026, 14:47:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో అడ్మిషన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పై అప్డేట్ వచ్చేసింది. మార్చి 1వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా…. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ అప్డేట్ - ప్రాథమిక కీ విడుదల
ఏపీ గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ అప్డేట్ - ప్రాథమిక కీ విడుదల

ఈ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ లో భాగంగా భాగంగా 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6 నుంచి 10వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లను కూడా భర్తీ చేస్తారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలన్నీ అందుబాటులోకి వచ్చాయి.

గురుకుల ఎంట్రెన్స్ పరీక్ష - ప్రాథమి కీలు విడుదల

  1. విద్యార్థులు https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలోని ప్రాథమిక కీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. 5వ తరగతిలో పాటు 6 నుంచి 10వ తరగతి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ఆప్షన్లు ఉంటాయి.
  4. మీరు హాజరైన పరీక్షకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయాలి.
  5. ఇక్కడ ప్రాథమిక కీ పీడీఎఫ్ డిస్ ప్లే అవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.

AP BRAGCET 2026లో భాగంగా 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం ఎగ్జామ్ నిర్వహించారు. ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్క్ తీసివేస్తారు.విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించి… సీట్లను భర్తీ చేస్తారు. గత కొంతకాలంగా గురుకుల సీట్ల కోసం తెగ డిమాండ్ ఉంటోంది. చాలా మంది తల్లిదండ్రులు… వారి పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More