IIT Tirupati Internship : ఐఐటీ తిరుపతి నుంచి ఇంటర్న్‌షిప్‌ నోటిఫికేషన్ - ఉచిత వసతి సౌకర్యం కూడా..!

IIT Tirupati Summer Internship 2026 : ఐఐటీ తిరుపతి నుంచి సమ్మర్ ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 

Published on: Mar 8, 2026, 09:58:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి సమ్మర్ ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. డిగ్రీ, బీటెక్, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా…. మార్చి 30వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.

ఐఐటీ తిరుపతి
ఐఐటీ తిరుపతి

నోటిఫికేషన్ లోని వివరాల ప్రకారం…. బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంస్సీ, బీఏ, ఎంఎ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, Civil and Environmental Engineering, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యూమానిటిస్ అండ్ సోషల్ సైన్సెస్, మ్యాథ్స్ అండ్ Statistics, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లలో ఖాళీలున్నాయి.

  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - 30 మార్చి 2026 (సాయంత్రం 5 గంటల లోపు
  • అధికారిక వెబ్ సైట్ - www.iittp.ac.in
  • అప్లికేషన్ లింక్ - https://iittp.plumerp.co.in/prod/iittirupati/internrp
  • మెయిల్ చిరునామా - summerinternship@iittp.ac.in

ఈ ఇంటర్న్ షిప్ కు ఎంపికైన వారికి ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. ప్రతి డిపార్ట్ మెంట్ లోని టాప్ 5లోని అభ్యర్థులకు నెలకు రూ. 5 వేల స్టైఫండ్ కూడా అందజేస్తారు.

మరోవైపు ఐఐటీ తిరుపతి నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 2 పోస్టులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నారు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 20వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది పాటు పని చేసిన ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి.

అర్హులైన అభ్యర్థులు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని మాత్రమే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు… వారి ధ్రువపత్రాలతో పాటు బయోడేటాను తీసుకెళ్లాలి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే csrc_recruitment@iittp.ac.in. మెయిల్ ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More