IIT Tirupati Recruitment : ఐఐటీ తిరుపతిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు - అప్లికేషన్ తేదీ, ముఖ్యమైన వివరాలు
IIT Tirupati Recruitment 2026: ఐఐటీ తిరుపతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 30వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 2 పోస్టులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నారు.

మార్చి 20 చివరి తేదీ…
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 20వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది పాటు పని చేసిన ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 20.03.2026 నాటికి 45 ఏళ్లు దాటకూడదు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,000 జీతం చెల్లిస్తారు. ఏడాది కాలానికి గానూ రిక్రూట్ చేసుకుంటారు. పని తీరు ఆధారంగా రెన్యూవల్ చేసే అవకాశం ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిని మాత్రమే ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు… వారి ధ్రువపత్రాలతో పాటు బయోడేటాను తీసుకెళ్లాలి. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే csrc_recruitment@iittp.ac.in. మెయిల్ ను సంప్రదించవచ్చు.
- అప్లికేషన్ లింక్ - https://forms.gle/ZQjMVTCsGwnnCe9u5
- దరఖాస్తుకు చివరి తేదీ - 20 మార్చి 2026
- అధికారిక వెబ్ సైట్ - https://www.iittp.ac.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











