RRB ALP : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రైల్వేలో 11వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ..
నిరుద్యోగులకు అద్భుతమైన వార్త! ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026లో భాగంగా ఈసారి 11వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇది ఇటీవలి కాలంలోనే అతిపెద్ద సంఖ్య. పూర్తి వివరాల్లోకి వెళితే..
నిరుద్యోగులు, రైల్వే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న వారికి భారతీయ రైల్వే శాఖ అద్భుతమైన తీపి కబురు అందించింది. 2026-27 రిక్రూట్‌మెంట్ సైకిల్ కోసం ఏకంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఖాళీల భర్తీకి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవలే అధికారికంగా ఉత్తర్వులు (Letter No. 2026(E/MPP)/25/13/ALP) జారీ అయ్యాయి.

గత కొన్ని ఏళ్లలో సాంకేతిక విభాగంలో వస్తున్న అతిపెద్ద నోటిఫికేషన్లలో ఇది ఒకటి కావడం విశేషం. 10వ తరగతితో పాటు ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక బంగారు అవకాశం అనే చెప్పుకోవచ్చు.
ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026- నోటిఫికేషన్ ప్రధాన అంశాలు..
మొత్తం ఖాళీలు- 11,127 పోస్టులు
పోస్ట్ పేరు- అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ)
విభాగం- 17 జోనల్ రైల్వేలు, సీఎల్‌డబ్ల్యూ
అర్హత- 10 + ఐటీఐ / డిప్లొమా / ఇంజినీరింగ్ డిగ్రీ
వయస్సు- 18 - 30 ఏళ్లు (రిజర్వేషన్ల ప్రకారం సడలింపు ఉంటుంది)
వేతన శ్రేణి- లెవల్-2 (7వ సీపీసీ ప్రకారం)
రిక్రూట్‌మెంట్ నిర్వహించేది- ఆర్ఆర్బీలు (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు)
ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులను ఐదు దశల్లో వడపోత చేసి తుది ఎంపిక నిర్వహిస్తారు. అవి:
సీబీటీ 1 (మొదటి దశ): ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇందులో క్వాలిఫై అయిన వారిని సీబీటీ 2కి పిలుస్తారు.
సీబీటీ 2 (రెండవ దశ): ఇది అత్యంత కీలకం. ఇందులో రెండు భాగాలు (పార్ట్-ఏ, పార్ట్-బీ) ఉంటాయి. మెరిట్ జాబితా తయారీలో ఈ మార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సీబీఏటీ (ఆప్టిట్యూడ్ టెస్ట్): లోకో పైలట్ ఉద్యోగానికి ఇది తప్పనిసరి. అభ్యర్థి ఏకాగ్రత, వేగాన్ని ఇందులో పరీక్షిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ): విద్యార్హత పత్రాల పరిశీలన.
వైద్య పరీక్షలు : రైల్వే ప్రమాణాల ప్రకారం అత్యంత కఠినమైన 'ఏ-1' మెడికల్ ఫిట్‌నెస్ ఉండాలి. ముఖ్యంగా కంటి చూపు చాలా ముఖ్యం.
ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026- ఖాళీలు ఇలా..
మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల్లో సెంట్రల్ రైల్వేవి 1400 ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేవి 1625 ఉన్నాయి. ఇక సౌత్ సెంట్రల్ రైల్వేవి 674, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేవి 200, సౌత్ ఈస్టర్న్ రైల్వేవి 1531, సథర్న్ రైల్వైవి 250, సౌత్ వెస్టర్న్ రైల్వేవి 200 ఖాళీలు ఉన్నాయి.
ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026- ఇది ఎందుకు ముఖ్యం?
ఉద్యోగ భద్రత: కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగం కాబట్టి పూర్తి భద్రత ఉంటుంది.
ప్రమోషన్లు: అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి లోకో పైలట్ (ట్రైన్ డ్రైవర్) గా ఎదిగే అవకాశం ఉంటుంది.
అలొవెన్సులు: బేసిక్ జీతంతో పాటు మైలేజీ అలొవెన్స్, డీఏ, హెచ్ఆర్ఏ వంటి ఇతర ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.
అభ్యర్థులకు సూచన:
ప్రస్తుతానికి రైల్వే బోర్డు కేవలం ఖాళీల భర్తీకి ఆమోదం మాత్రమే తెలిపింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ (సీఈఎన్ 2026) త్వరలోనే వెలువడనుంది. అప్పుడు దరఖాస్తు తేదీలు, సిలబస్ వంటి పూర్తి వివరాలు తెలుస్తాయి. పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టడం ఉత్తమం.
నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్స్‌ని తరచూ చెక్ చేస్తూ ఉండండి.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైందా?
సమాధానం- లేదు. ప్రస్తుతానికి ఖాళీల ఆమోదానికి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే బయటకు వచ్చింది. రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రశ్న- ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్లో ఏముంటాయి?
సమాధానం- రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ తేదీలు, పరీక్ష తేదీలు, వయస్సు పరిమితి, విద్యార్హత వంటి కీలక వివరాలు ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


