...
...
Next Story

అమరావతి రెండో దశ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ - కేబినెట్ నిర్ణయాలివే

ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. అమరావతి పరిధిలో రెండో దశ భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 16,666.57 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

Published on: Nov 28, 2025, 18:06:50 IST
Advertisement

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 గ్రామాల పరిధిలో మరో 16,666.57 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏకు అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

ఏపీ కేబినెట్
ఏపీ కేబినెట్

కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి,పెదపరిమి గ్రామాల పరిధిలో సీఆర్డీఏ భూసమీకరణ చేపట్టనుంది.మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాలను సమీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా చేపట్టబోయే భూసేకరణలో 16 వేలను సేకరించటం సేకరిస్తారు. మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 70 వేల ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణం చేస్తారు.

ఇవాళ మొత్తం 25 అంశాల అజెండాతో కేబినెట్ భేటీ అయింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్లు విడుదల కాగా… తుది నోటిఫికేషన్ల జారీపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe