ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాపీలు తయారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Published on: Nov 28, 2025, 09:25:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లను జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ కాపీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో నోటిఫికేషన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీలో కొత్త జిల్లాలు
ఏపీలో కొత్త జిల్లాలు

మరోవైపు ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం (కాకినాడ జిల్లా నుంచి), మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది.

వీటి విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని మండలాలను మరో జిల్లాలకు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటి వివరాలు పరిశీలిస్తే….

  • సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది. కడప డివిజన్‌ పరిధిలో ఉన్న రాజంపేటను కలిపారు.
  • కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రెవెన్యూ డివిజన్‌ను మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  • నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేశారు.
  • కలువోయ మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్చారు.
  • సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్పు చేశారు.
  • కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు మార్చారు. ఈ 3 మండలాలను రామచంద్రాపురం డివిజన్‌ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌కు మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్‌ నుంచి చిత్తూరు డివిజన్‌లో కలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More