ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్నాయి.

Updated on: Nov 25, 2025, 17:41:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని రోజులుగా మంత్రుల కమిటీ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు. అందులో కొన్ని మార్పులు జరిగాయి. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది.

ఏపీలో మూడు కొత్త జిల్లాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు

ఇక రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు కానున్నాయి. ఐదింటికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటు కానున్న మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పండ్ల తోటలపై సమీక్ష

రాయలసీమలో పండ్ల తోటల పెంపకం, సాగు సబ్సిడీ, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌ తదితర అంశాలపై చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై చర్చ జరిగింది.

రాయలసీమలోని పండ్లతోటల రైతుల ఆదాయం పెంచేందుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More