AP Cabinet : అమరావతికి భారీగా నిధులు... ఢిల్లీలో కొత్తగా ఏపీ భవన్ - ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions 2026 : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.అమరావతి రాజధాని పనులు, పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంపు, ఢిల్లీలో ఏపీ భవన్ నిర్మాణం సహా పలు కీలక ప్రాజెక్టులకుపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.

Published on: Apr 30, 2026, 21:07:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Cabinet Decisions 2026: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (ఏప్రిల్ 30, 2026) 48వ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, పోలవరం నిర్వాసితులకు అండగా నిలవడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేబినెట్ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం అనంతరం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఏపీ కేబినెట్ భేటీ
ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ - నిర్ణయాలు:

  • రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. అమరావతి సచివాలయ టవర్లకు గ్లాస్ క్లాడింగ్, పివి ప్యానెల్స్ వంటి అత్యాధునిక హంగుల కోసం రూ. 2,540 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపారు.
  • క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ టవర్ల నిర్మాణానికి రూ. 1,208 కోట్లు, శాసనసభ భవనంలో పెండింగ్ పనులకు రూ. 798 కోట్లు కేటాయించారు. అలాగే ఉండవల్లి పరిధిలోని లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కోసం రూ. 580 కోట్లు మంజూరు చేశారు.
  • కృష్ణా నది వరద నిరోధక కట్టల బలోపేతానికి రూ. 443 కోట్లు కేటాయించి…. కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం.
  • పోలవరం ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) ఎంచుకున్న వారికి ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ. 2.85 లక్షల నుండి రూ. 3.57 లక్షలకు పెంచారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలు కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఇచ్చే స్థలం విలువను రూ. లక్ష నుండి రూ. 2 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2022-23 నాటి సవరించిన ధరల ప్రకారం ఈ పెంపు అమలు చేయనున్నారు.
  • హోం శాఖలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF)లో 2000 బ్యాచ్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు 385 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు.
  • న్యాయ శాఖలో 21 కొత్త కోర్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా మరికొన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.
  • దేశ రాజధానిలో రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా రూ. 124.50 కోట్లతో నూతన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఎన్‌బిసిసి (NBCC) సంస్థకు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు.
  • ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో వ్యత్యాస పనుల కోసం అదనంగా రూ. 354 కోట్లు మంజూరు చేశారు.
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో డిఫెన్స్ పరిశ్రమ స్థాపన కోసం 600 ఎకరాల భూమిని కేటాయించారు.
  • శ్రీకాకుళం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 1,586 కోట్లు కేటాయింపు.
  • రబీ సీజన్‌లో వరి సేకరణ కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ. 1800 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కిసాన్ డ్రోన్ పథకాన్ని 2025-26లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో మ్యుటేషన్ ఛార్జీలు ఏకరూపంగా ఉండేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More