...
...
Next Story

ట్విన్ టవర్స్‌కు రూ.1,002 కోట్లు.. ఆ కీలక బిల్లుల ఉపసంహరణ : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Aug 6, 2026, 16:59:30 IST
Advertisement

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. మొత్తం 34 కీలక అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్, రాష్ట్ర అభివృద్ధి, పాలనా సంస్కరణలకు బాటలు వేసే పలు బిల్లులు, పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ క్యాబినెట్ సమావేశం
ఏపీ క్యాబినెట్ సమావేశం

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకు రూ.1,002.49 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ సమ్మతించింది. ఈ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ ఎల్‌అండ్‌టీకి అప్పగించాలని నిర్ణయించారు.

అసెంబ్లీ, హైకోర్టు భవనాల నూతన డిజైన్ల కోసం అదనపు నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. అమరావతి ఐ ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా రీ-టెండర్లు పిలవాలని ఆదేశించింది. అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు మంత్రివర్గం సమ్మతి తెలిపింది.

అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ (భూ ఆక్రమణల నిరోధక) బిల్లు-2024లను ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా, భూ ఆక్రమణలు, మహిళల రక్షణపై మరింత పటిష్ఠమైన నూతన చట్టాలను రూపొందించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026తో పాటు ఏపీ పీపీపీ పాలసీ-2026 ముసాయిదాలకు ఆమోదం తెలిపారు. పాదచారుల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేకంగా పాదచారుల భద్రత పాలసీ-2026 అమలుకు ఆమోదముద్ర వేశారు.

దీనితో పాటు మున్సిపాలిటీలకు చెందిన భూముల లీజు గడువును పెంచేందుకు చట్టసవరణలు చేయడం, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks