...
...
Next Story

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత - ఆధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఒక్కసారిగా 50 శాతం పెరగడం వల్లే బంకుల వద్ద రద్దీ కనిపిస్తోందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు.

Published on: Apr 26, 2026, 16:00:40 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. పలు చోట్ల 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఆదివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంధన సరఫరా, నిల్వలు, పంపిణీ తీరుపై కీలక సమీక్ష నిర్వహించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఇంధన సరఫరా గతంతో పోలిస్తే 10 శాతం పెరిగిందని…. అయితే 'ప్యానిక్ బయింగ్' (ఆందోళనతో ముందస్తుగా కొనుగోలు చేయడం) కారణంగానే బంకుల్లో కొరత ఏర్పడుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ అమ్ముడవుతాయి. కానీ, కొరత రాబోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. దీంతో శనివారం ఒక్కరోజే ఏకంగా 10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్ విక్రయాలు జరిగాయి. అంటే సాధారణ అమ్మకాల కంటే డిమాండ్ 50 శాతం మేర పెరగడంతో బంకుల్లో ఉన్న నిల్వలు వేగంగా నిండుకుంటున్నాయి.

సీఎం కీలక ఆదేశాలు…..

పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిల్వలపై తప్పుడు ప్రచారాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సరఫరా గొలుసులో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాలని, కంపెనీల నుంచి డిపోలకు, అక్కడి నుంచి బంకులకు ఇంధనం చేరే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. "సాధారణ అవసరాల కంటే ఎక్కువ స్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతోనే ఈ సమస్య వస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలి," అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న తక్షణ చర్యలు, సమస్య పరిష్కారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks