పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి అనకాపల్లి జిల్లా చేరుతుంది : సీఎం చంద్రబాబు
పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి అనకాపల్లి జిల్లా చేరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుందన్నారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందన్నారు.

'ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి వెనుకబడిన ప్రాంతం. కానీ ఇప్పుడు ఆ జిల్లానే సంపద కలిగిన ప్రాంతం. విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుంది.' అని చంద్రబాబు అన్నారు.
కేంద్ర మాజీమంత్రి దివంగత యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ సోలార్ వేఫర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో పెట్టుబడులు పెట్టి దాని కోసం ఆయన ఏపీని ఎంచుకున్నారన్నారు. అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగమని చెప్పారు. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించినట్టేనన్నారు.
అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. గత పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెన్యూ ఎనర్జీ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, రాంబిల్లిలో సౌర ఫలకాలు తయారవుతాయన్నారు. విద్యుత్ సంస్కరణల్ని ప్రారంభించింది మేమే అని, ఆ ఫలితాలు అందరికీ అందుతున్నాయన్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే నిలబెట్టుకుంటున్నామన్నారు. 2019-24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణా లోపంతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం అయ్యిందన్నారు.
'పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం కట్టాల్సి వచ్చింది. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ ఆప్ ఛార్జీలు వసూలు చేశారు. ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 5.95 లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు వచ్చాయి. 90 గిగావాట్ల మేర ప్రతిపాదనలు, ఎంఓయూలు సిద్ధమై పోయాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తోంది. గ్రీన్ ఈవీ వాహనాలు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాం. ఆర్టీసీ కూడా 1,050 బస్సులు తీసుకువస్తోంది. రాష్ట్రంలో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం.' అని చంద్రబాబు అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


