పేదలకు శుభవార్త - ఇవాళ ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందిస్తారు. 

Published on: Nov 12, 2025, 07:57:20 IST
By , Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఒకేసారి 3 లక్షల మంది పేదలు… గృహ ప్రవేశాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 లక్షల ఇళ్లలో లబ్దిదారుల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

గృహ ప్రవేశాలు (ఫైల్ ఫొటో)
గృహ ప్రవేశాలు (ఫైల్ ఫొటో)

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-బీఎల్సీ కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేయనున్నారు.

మొత్తంగా 3,00,192 ఇళ్లకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ద్వారా దాదాపు ఉచిత ఇసుక విధానంతో దాదాపు 20 టన్నుల ఇసుక ఉచితంగా పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.

గతంలో నిలిపేసిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన బకాయి బిల్లులను దశల వారీగా కూటమి ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పూర్తి చేసిన ఈ ఇళ్లనే కాకుండా.. మరిన్ని ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 3 లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొననున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More