AP DEECET 2026 : ఏపీ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ అప్డేట్ - ఇలా దరఖాస్తు చేసుకోండి

AP DEECET Notification 2026 : ఏపీ డీఈఈసెట్‌ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుంది.

Published on: Apr 3, 2026, 14:34:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ డీఈఈ సెట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సారానికి గానూ రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఐఈడీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు.

ఏపీ డీఈఈసెట్‌ నోటిఫికేషన్
ఏపీ డీఈఈసెట్‌ నోటిఫికేషన్

ప్రస్తుతం ఏపీ డీఈఈసెట్ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుంది. అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం ఉంటే సరిపోతుంది. 2026 సెప్టెంబర్‌ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలని…. గరిష్ట వయో పరిమితి లేదని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఏపీ డీఈఈసెట్ 2026 - దరఖాస్తు విధానం:

  1. అభ్యర్థులు https://apdeecet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేయాలి.
  4. అభ్యర్థి వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ పూర్తి చేయాలి.
  5. అభ్యర్థి ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. చివరగా సబ్మిట్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
  7. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందొచ్చు.

ఏపీ డీఈఈసెట్‌ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఇస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థి… ఆప్షన్ ఎంచుకోవాలి. ఇతర వివరాల కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 7995869743ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More