AP Ration Applications : రేషన్ కార్డుదారులకు అలర్ట్ - పెరిగిన అప్లికేషన్ సర్వీస్ ఛార్జీలు..!
రాష్ట్రంలో రేషన్ కార్డు స సర్వీస్ ఛార్జీలు పెరిగాయి. దీంతో కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పు వంటి సేవలకు అధికంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
రేషన్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసింది. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని ప్రకటించగా… కొత్తగా కార్డులు కావాల్సిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక పేర్ల మార్పుతో పాటు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇక రేషన్ కార్డ్ అప్లికేషన్లకు సంబంధించి సర్వీస్ ఛార్జ్ లను పెంచారు. దీంతో కొత్త రైస్ కార్డ్, డూప్లికేట్ రైస్ కార్డ్, రైస్ కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైస్ కార్డ్ విభజన వంటి అన్ని సేవల కోసం ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగిన ఛార్జీలు - వివరాలు…
- మీసేవా, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల రేషన్ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
- గతంలో రూ. 24 సేవా రుసుం కలిగిన సేవలు ఇప్పుడు రూ.100కు పెరిగాయి.
- గతంలో రూ.48 సేవా రుసుముగా గల రైస్ కార్డ్ విభజన సర్వీస్ రూ.200కు పెరిగింది.
- కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తుతో పాటు డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ కార్డుల్లోని వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడం వంటి సేవలకు ఛార్జీలు వర్తిస్తాయి.
- కొత్త సభ్యులను చేర్చడం, ఉన్న సభ్యులను తొలగించడం, అడ్రస్ మార్పు, రైస్ కార్డును విభజించడం వంటి అన్ని సేవలకు కూడా సర్వీస్ ఛార్జీలకు అమలవుతాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే..?
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

