ఏపీలో రూ. 20కే కిలో గోధుమ పిండి - రేషన్ షాపుల్లో పంపిణీ ప్రారంభం

ఏపీలోని రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త వచ్చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద అర్బన్‌ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ. 20కు గోధుమ పిండిని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించింది.

Published on: Jan 2, 2026, 13:13:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ కొత్త సంవత్సరం వేళ ఏపీ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తోంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్ట్ కింద పట్టణ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా కిలో గోధుమ పిండిని అందజేయనుంది.

ఏపీలో రేషన్ పంపిణీ
ఏపీలో రేషన్ పంపిణీ

రూ. 20కే కిలో….

బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉండగా, ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ విజయవంతమైతే…. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. తాజాగా గోధుమ పిండి కూడా రేషన్ కార్డుదారులకు అందనుంది.

ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. సహజంగా చెక్కి తయారు చేసిన నాణ్యమైన గోధుమ పిండిని అతి తక్కువ ధరలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. నాణ్యత తనిఖీ తర్వాత సురక్షిత ప్యాకింగ్‌తో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ సదుపాయాన్ని…. రేషన్ కార్డుదారులందరూ వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు రాష్ట్కరంలో స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.

ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.

రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

కాబట్టి ఈకేవైసీ విషయంలో లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా… 3 నెలలుగా రేషన్ తీసుకోకుండా ఉండొద్దు, ఈ 2 విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్డు రద్దవుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More