ఏపీ రేషన్ కార్డుదారులకు న్యూ ఇయర్ నుంచి రూ.20కే కిలో గోధుమ పిండి

ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు న్యూఇయర్ గుడ్‌న్యూస్ ఇప్పుడే చెప్పింది. రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండిని అందించనుంది.

Published on: Dec 24, 2025, 17:04:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సబ్సిడీపై గోధుమ పిండిని అందించనుంది. దీనికి రేషన్ కార్డుదారులు చెల్లించాల్సింది కేవలం రూ.20 మాత్రమే. జనవరి 1 నుంచి 20 రూపాయలకే కిలో గోధుమ పిండి జనాలకు అందనుంది. దీనితో మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే గోధుమ పిండి ప్రజలకు దొరుకుతుంది. పండుగ సమయంలో పేద ప్రజలు కూడా పిండి వంటలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టుగా అర్థమవుతోంది.

రేషన్ కార్డుదారులకు గోధుమపిండి
రేషన్ కార్డుదారులకు గోధుమపిండి

ప్రస్తుతం మార్కెట్లో కేజీ గోధుమ పిండికి రూ.40 నుంచి 70 వరకు ఉంది. ఇది కూడా సాధారణ క్వాలిటీ పిండికి మాత్రమే. ఇక టాప్ బ్రాండ్ల గోధుమ పిండికి కేజీకి రూ.100 వరకు అమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలు ప్రజలు చాలా ఇబ్బందులు చూస్తున్నారు.

కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్‌సీఐ ద్వారా తీసుకుంటోంది ప్రభుత్వం. నాణ్యమైన గోధుమలను సేకరించి శుద్ధి చేసి పిండిగా తయారు చేస్తున్నారు. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చూసుకుంటోంది. వాటిని గోధుమ పిండిగా మారుస్తుంది. ప్రతీ రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. డిసెంబర్ చివరి వరకు ప్రతీ జిల్లాలోని రేషన్ షాపులకు వీటిని పంపనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి పంపిణీ జరగనుంది.

మెుదట ఈ పథకాన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరల ప్రభావం, పిండి వినియోగం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ గోధుమ పిండిని తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే.. డిమాండ్‌ను ఆధారంగా రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతీ నెల సబ్సిడీపై గోధుమ పిండిని పంపిణీ చేస్తారు.

నెలనెలా ఎంత మేరకు గోధుమ పిండి సరఫరా చేయాలన్న దాని మీద ప్రభుత్వం డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. మార్కెట్లో అధిక ధరతో పిండిని కొనలేకపోతున్న వారికి మంచి అవకాశం అవుతుంది.

గతంలో గోధుమలను కార్డుదారులకు సరిగ్గా అందించలేదు. పిండి నాణ్యత సరిగాలేదని, వాసన పేరుతో చాలా మంది కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు త్వరలోనే రేషన్ డిపోల ద్వారా రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More