ఏపీ రేషన్ కార్డుదారులకు అప్డేట్ - రూ.18కే గోధుమ పిండి...! ఇవిగో వివరాలు
ఏపీలోని రేషన్ కార్డుదారులకు శుభవార్త వచ్చేసింది. జనవరి 1 నుంచి పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో గోధుమపిండిని కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
రాష్ట్రంలోని రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త వచ్చేసింది. పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.

ఇటీవలే ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి కేజీ గోధుమ పిండి కుటుంబానికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన గోధుమ పిండిని అందజేస్తామని వివరించారు. ఫలితంగా ప్రస్తుతం ఇస్తున్నవి మాత్రమే కాకుండా… జనవరి 1వ తేదీ నుంచి రేషన్ కార్డుదారులు రూ. 18 చెల్లించి కేజీ గోధుమ పిండిని కూడా పొందవచ్చు.
ఈకేవైసీ తప్పనిసరి:
ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్కన పెట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీ కేంద్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవైసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

