రేషన్ కార్డుదారులకు అలర్ట్ - ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి

రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల మంజూరవుతున్నాయి. ఇప్పటికే చాలా కుటుంబాలకు ఈ కార్డులు అందాయి. అయితే కొత్తగా కార్డులు పొందినవారితో పాటు పేర్లు నమోదు చేసుకున్నవారు.. తప్పకుండా ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Published on: Dec 19, 2025 2:36 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ఈ కార్డులు పొందారు. మరికొందరూ దరఖాస్తు చేసుకోగా… పరిశీలన దశలో ఉన్నాయి. ఇక పాత కార్డులో కూడా పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మీ-సేవా ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకుంటున్నారు.

రేషన్ ఈకేవైసీ
రేషన్ ఈకేవైసీ

కొత్తగా కార్డు పొందినవారితో పాటు పేర్లు ఎక్కిన వాళ్లు ప్రతి నెలా రేషన్ తీసుకుంటున్నారు. అయితే కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారిలో చాలా మంది ఈకేవైసీ పూర్తి చేసుకోలేదు. అయితే ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రకటనలు కూడా చేశారు. రేషన్ కార్డు దారులందరూ ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.

ఇటీవలే రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. ఈకేవైసీ చేసుకోకపోతే జనవరి నుంచి రేషన్ కట్ చేస్తారని ఇందులో ఉంది. ఇదే అంశంపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ-కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని… కార్డులు రద్దు అవుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.

తప్పనిసరిగా చేసుకోవాల్సిందే…!

ఈకేవైసీ కోసం గడువంటూ ఏం లేకపోయినప్పటికీ తప్పకుండా ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోవడం మాత్రం తప్పనిసరి అని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా… సమీపంలోని రేషన్ షాపు వద్దకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

వేలిముద్రల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే… అలాంటి వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సలు పడని పక్షంలో, ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టడం వెనక చాలా కారణాలున్నాయి. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం అందే అవకాశం ఉంటుంది. అక్రమాలకు దాదాపుగా అడ్డుకట్ట పడుతుంది. కాబట్టి…ఈ విషయంపై పౌరసరఫరాలశాఖ అధికారులు పదే పదే అవగాహన కల్పిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More