Andhrapradesh : రేషన్ కార్డుదారులకు శుభవార్త - ఈ ప్రాంతాల్లోనూ రూ.20కే గోధుమ పిండి, నేటి నుంచే అమలు
ఏపీలోని రేషన్ కార్డుదారులకు మరో శుభవార్త వచ్చేసింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తున్న రూ. 20కే కిలో గోధుమ పిండిని… ఇకపై అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయనున్నారు.
ఏపీలోని రేషన్ కార్డుదారులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ దుకాణాల్లో కిలో రూ.20కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే గోధుమ పిండిని పంపిణీ చేశారు. కానీ ఇవాళ్టి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లోనూ లబ్ధిదారులకు అందజేస్తారు.

త్వరలోనే అక్కడ కూడా - మంత్రి నాదెండ్ల
ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. త్వరలోనే డివిజన్, మండల స్థాయి దుకాణాల్లోనూ గోధుమ పిండిని అందజేస్తామని ప్రకటించారు.
బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర 60 నుంచి 65 రూపాయల వరకు ఉంటోంది. కానీ ప్రభుత్వం చౌక దుకాణాల్లో కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా… జిల్లా కేంద్రాల్లోనూ… ఆ తర్వాత డివిజన్ మండల, గ్రామస్థాయిలోనూ అమలు చేస్తారు.
ఏపీలో ఇప్పటికే రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారు. తాజాగా గోధుమ పిండి కూడా రేషన్ కార్డుదారులకు అందనుంది.ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. సహజంగా చెక్కి తయారు చేసిన నాణ్యమైన గోధుమ పిండిని అతి తక్కువ ధరలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నాణ్యత తనిఖీ తర్వాత సురక్షిత ప్యాకింగ్‌తో పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ సదుపాయాన్ని…. రేషన్ కార్డుదారులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌కు మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా పౌరసరఫరాల శాఖ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు… ఇంకా చాలా మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ చేయించుకోలేదు. ఈ ప్రాసెస్ వారి రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది. వేలిముద్ర ద్వారా లబ్ధిదారుని ధ్రువీకరించే ప్రక్రియనే ఈకైవీసీ అంటారు. దీంతో నకిలీ రేషన్ కార్డులను పూర్తిగా తొలగించవచ్చు.
ఈకేవైసీ పకడ్బందీగా నిర్వహించటం ద్వారా… నకిలీ లబ్ధిదారులను ఏరివేస్తారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఈకేవైసీ సమాచారాన్ని సేకరిస్తోంది.
రేషన్ డీలర్ షాప్ లో ఈకేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.గ్రామ / వార్డు సచివాలయాల్లో కూడా ఈ ప్రాసెస్ చేస్తారు.E-PoS(ఈ పోస్) యంత్రంలో వేలిముద్ర పెట్టగానే E-KYC పూర్తవుతుంది. మరోవైపు కార్డు ఇప్పటివరకు తీసుకొనివారు.. ఆయా రేషన్ షాపుల వద్దకు తీసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

