...
...
Next Story

AP Degree Admissions : ఏపీ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ - సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల, రిపోర్టింగ్ తేదీలివే

AP Degree Seat Allotment 2026 : ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 10 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Published on: Sep 7, 2026, 13:18:07 IST
Advertisement

AP Degree Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సీట్ల కేటాయింపు (Seat Allotment) ప్రక్రియ పూర్తయింది. ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు తమకు ఏ కళాశాలలో, ఏ కోర్సులో సీటు దక్కిందో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

అలాట్‌మెంట్ డౌన్లోడ్ ఇలా…

ఏపీ డిగ్రీ సీట్ల కేటాయింపు
ఏపీ డిగ్రీ సీట్ల కేటాయింపు

విద్యార్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను నేరుగా https://cap.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. వెబ్ సైట్‌లోకి వెళ్లి లాగిన్(రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌) కావాలి. మీకు సీటు అలాట్ అయితే మీ లాగిన్ లో అలాట్ మెంట్ అర్డర్ కాపీ డిస్ ప్లే అవుతుంది. ఈ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ తీసుకోవాలి.

కళాశాలల్లో రిపోర్టింగ్ - ముఖ్యమైన తేదీలు:

సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో నిర్దేశిత సమయంలోగా రిపోర్ట్ చేయడం తప్పనిసరి. అలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

• కళాశాలల్లో రిపోర్టింగ్ తేదీలు: సెప్టెంబర్ 7, 2026 నుండి సెప్టెంబర్ 10, 2026 వరకు.

• తరగతుల ప్రారంభం : సెప్టెంబర్ 7, 2026 నుంచే నూతన విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

విద్యార్థులు సీటు కేటాయింపు లేఖతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను తీసుకుని నిర్ణీత గడువులోగా సంబంధిత కళాశాలల్లో సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రంలోగా రిపోర్ట్ చేయని విద్యార్థుల సీట్లు రద్దయ్యే అవకాశం ఉంది, కాబట్టి అభ్యర్థులు వీలైనంత త్వరగా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe