AP Handicrafts Wood Banks : ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు, విశిష్ట వారసత్వ సంపదకు సజీవ రూపాలైన హస్తకళల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని హస్తకళాకారులను ఆదుకోవడానికి, వారికి ఎదురవుతున్న ముడిసరుకు కొరతను తీర్చడానికి ఏర్పాటు చేసిన 'క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను' రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.

రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ రూపుదిద్దిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఇతర క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు.
5 వేల మంది కళాకారులకు భరోసా…
ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రధాన ముడిసరుకైన కలప దొరక్క పడుతున్న ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తి కలగనుంది. ధవళేశ్వరంలోని రాజమహేంద్రవరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల నాణ్యమైన కలపను కళాకారుల అవసరాల కోసం అందుబాటులో ఉంచారు.
రాబోయే ఐదేళ్లకు సరిపడా కలప నిల్వలను త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రపంచప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, మాధవమాల ఉత్పత్తులు, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల తయారీదారుల కోసం ఆయా ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా ఈ వుడ్ బ్యాంకులను నెలకొల్పడం విశేషం.
ప్రతి బొమ్మపై క్యూఆర్ కోడ్…..
కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి వుడ్ బ్యాంకులోని కలప నిల్వలను, వివిధ క్లస్టర్ల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన అత్యద్భుత కళాకృతులను తిలకించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ప్రతి బొమ్మపైనా ఏర్పాటు చేసిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్వయంగా స్కాన్ చేసి చూశారు. ఆ స్కాన్ ద్వారా కళాకారుడి వివరాలు, బొమ్మల తయారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ప్రదర్శన స్టాల్ వద్దకు వెళ్లి కళాకారులతో ముచ్చటించారు. బొమ్మలు తయారు చేసే శ్రమను, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
{{/usCountry}}కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి వుడ్ బ్యాంకులోని కలప నిల్వలను, వివిధ క్లస్టర్ల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన అత్యద్భుత కళాకృతులను తిలకించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ప్రతి బొమ్మపైనా ఏర్పాటు చేసిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్వయంగా స్కాన్ చేసి చూశారు. ఆ స్కాన్ ద్వారా కళాకారుడి వివరాలు, బొమ్మల తయారీ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ప్రదర్శన స్టాల్ వద్దకు వెళ్లి కళాకారులతో ముచ్చటించారు. బొమ్మలు తయారు చేసే శ్రమను, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
{{/usCountry}}అంతేకాకుండా…. వుడ్ బ్యాంకులో నిల్వ ఉంచిన కలప దుంగలపై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేశారు. ఆ దుంగను ఏ అటవీ ప్రాంతం నుంచి సేకరించారు, ఆ చెట్టు వయస్సు ఎంత..? దాని శాస్త్రీయ నామం ఏమిటి వంటి ఆసక్తికర వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలో ఉంచిన పలు హస్తకళాకృతులు నచ్చడంతో సతీమణి అన్నా కొణిదెలతో కలసి ఉప ముఖ్యమంత్రి వాటిని కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించారు.