Godavari Flood Update : ధవళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి వరద ఉద్ధృతి - లంక గ్రామాలకు అలర్ట్, ఈ జిల్లాలకు వర్ష సూచన
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.
గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజి వద్ద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో దిగువ ప్రాంతాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఆదివారం రాత్రి నాటికి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి 14.13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కాస్త తగ్గినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలు మరియు నదీ పరివాహక ప్రాంతవాసులు వరద నీరు పూర్తిగా తగ్గే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు.
నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం…. ఈ రోజు ( ఆగస్టు 03) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మిగిలిన పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

