ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. పదో తరగతి, డిగ్రీ ఉంటే చాలు.. ఈ నెలలోనే లాస్ట్ డేట్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jan 18, 2026 6:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న 35 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఫ్రంట్ ఆఫీస్ కో ఆర్టినేటర్, రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు
ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. పదో తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. జనవరి 27వ తేదీ వరకు అప్లై చేయాలి. 11 జిల్లా కోర్టుల్లో 35 పోస్టులు ఉన్నాయి.

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు జిల్లాల వారీగా విడుదలైన జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు దొరుకుతుంది.

ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేయాలి. ఓఎంఆర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఆఫ్‌లైన్ అప్లికేషన్ జనవరి 12వ తేదీన ప్రారంభమైంది. జనవరి 27వ తేదీ వరకు ఉంటుంది.

ఆఫీస్ కో-ఆర్డినేటర్ : కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత, ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

రికార్డు అసిస్టెంట్ : ఎస్ఎస్‌సీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్ : కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత, ఎంఎస్ ఆఫీస్‌లో కనీసం మూడేళ్ల అనుభువం ఉండాలి.

ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుకు జీతం స్కేల్ రూ.25,220 - రూ. 80,910 వరకు ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.23,120 - రూ.74,770, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు పే స్కేల్ రూ. 28,280 - రూ. 89,720 వరకు నెల జీతం ఉంటుంది.

ఆయా జిల్లాల లీగల్ సర్వీసెస్ అథారిటీ పేరుతో స్పీడ్ పోస్ట్ చేయాలి. పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు రూ.500గా దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. డీడీని ఏదైనా జాతీయ బ్యాంకు నుండి తీసుకొని, కార్యదర్శి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆయా జిల్లా పేరుతో స్పీడ్ పోస్ట్‌లో చెల్లించాలి.

జిల్లాల వారీగా ఉన్న కోర్టుల అధికారిక వెబ్‌సైట్ వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌, నోటిఫికేషన్ సెక్షన్‌లలో ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూడవచ్చు. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉదాహరణకు శ్రీకాకుళం ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More