AP DSC 2026 Recruitment Notification : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మంగళవారం రాత్రి డీఎస్సీ-2026 ప్రాథమిక (షార్ట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 2,721 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం విద్యాశాఖ వేర్వేరు ప్రకటనలను జారీ చేసింది.

ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలల్లో 2,111 జనరల్ టీచర్ పోస్టులను (స్కూల్ అసిస్టెంట్లు 906, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,205) భర్తీ చేయనున్నారు. వీటితో పాటు 350 ప్రత్యేక ఉపాధ్యాయ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను, వివిధ సొసైటీల్లో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కేటగిరీల్లో 260 పోస్టులను నింపనున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్య పరిధిలో ఉన్న 2,111 పోస్టుల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 389 ఖాళీలు ఉన్నాయి (సాధారణ, ప్రత్యేక పోస్టులు కలిపి 404). ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం జిల్లాలో 266 ఖాళీలు, కడప జిల్లాల్లో 206 ఖాళీలన్నాయి.
అనంతపురం జిల్లాలో 92, నెల్లూరులో 165, చిత్తూరులో 130, తిరుపతిలో 99 పోస్టులను రిక్రూట్ చేస్తారు. అతి తక్కువగా విజయనగరంలో 4, పార్వతీపురం మన్యంలో 8, పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల్లో 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ఇక వివిధ సంక్షేమ సొసైటీలు, ఆదర్శ పాఠశాలల పరిధిలో మొత్తం 260 పోస్టులను కేటాయించారు. వీటిలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనే 85 ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తుండగా….. పీజీటీ, టీజీటీ పోస్టులను జోనల్ కేడర్గా పరిగణిస్తారు. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ పోస్టులను ఇటీవలే ప్రభుత్వం స్థానిక కేడర్ పోస్టులుగా వర్గీకరించింది.
నవంబర్ 3 నుంచి దరఖాస్తులు….
ఈ నియామకాలకు సంబంధించి నవంబరు 3 నుంచి అధికారిక పోర్టల్ ( https://tet2dsc.apcfss.in ) ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను అందుబాటులోకి తీసుకువస్తుంది. పూర్తి నోటిఫికేషన్లో పోస్టుల వారీగా రోస్టర్లు, రిజర్వేషన్లు, వయోపరిమితి, విద్యార్హతలు మరియు పరీక్షా తేదీల సమాచారాన్ని సమగ్రంగా వెల్లడిస్తారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్ మోడ్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}ఈ నియామకాలకు సంబంధించి నవంబరు 3 నుంచి అధికారిక పోర్టల్ ( https://tet2dsc.apcfss.in ) ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే ముందే విద్యాశాఖ పూర్తిస్థాయి నోటిఫికేషన్ను అందుబాటులోకి తీసుకువస్తుంది. పూర్తి నోటిఫికేషన్లో పోస్టుల వారీగా రోస్టర్లు, రిజర్వేషన్లు, వయోపరిమితి, విద్యార్హతలు మరియు పరీక్షా తేదీల సమాచారాన్ని సమగ్రంగా వెల్లడిస్తారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్ మోడ్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
{{/usCountry}}