AP DSC Notification 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు, ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో మరో డీఎస్సీ ప్రకటన విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి వివిధ విద్యా సంస్థల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. యాజమాన్యాల వారీగా ఏయే విభాగాల్లో ఎన్నెన్ని పోస్టులు అవసరమో స్పష్టమైన అంచనాకు వచ్చి…. ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
అక్టోబర్ 15న నోటిఫికేషన్….!

ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా విద్యాశాఖ 2026 నాటి డీఎస్సీ ప్రకటనకు సన్నాహాలు ముమ్మరం చేసింది. రాబోయే అక్టోబరు 15న ఈ ఉద్యోగ ప్రకటనలను అధికారికంగా విడుదల చేయాలని నిర్ణయించారు. కేవలం ఉపాధ్యాయ పోస్టులే కాకుండా, ప్రభుత్వం మరిన్ని విద్యా సంబంధిత శాఖల్లో ఖాళీల భర్తీకి కూడా ఏకకాలంలో పచ్చజెండా ఊపనుంది.
ఖాళీల వివరాలు సేకరణ….
పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,500కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక (మున్సిపల్) పాఠశాలల్లోనే దాదాపు 2,250కి పైగా ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఖ్యపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా తుది నిర్ణయం తీసుకోనుంది.
వీటితో పాటు సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ సంక్షేమ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూల్స్), ఏపీ రెసిడెన్షియల్స్, జువనైల్ సంక్షేమం, దివ్యాంగ సంక్షేమ విద్యా సంస్థల్లో మరో 300 వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇవన్నీ కలిపి 2,500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ అయితే… డిసెంబర్లోనే పరీక్షలు నిర్వహించవచ్చు. త్వరలోనే కొత్త నోటిఫికేష్ జారీ కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటించనుంది.
{{/usCountry}}అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ అయితే… డిసెంబర్లోనే పరీక్షలు నిర్వహించవచ్చు. త్వరలోనే కొత్త నోటిఫికేష్ జారీ కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు త్వరలోనే విద్యాశాఖ అధికారికంగా ప్రకటించనుంది.
{{/usCountry}}