త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది.. ఈ పరీక్షకు కూడా ఉచిత కోచింగ్ : మంత్రి సవిత
ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఇదే కూటమి లక్ష్యమని తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు.
ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్.సవిత అన్నారు. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను మంగళవారం మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్బంగా బీసీ అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల మెటీరియల్ ను వారికి అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. 16,457 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగానే, బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభించామన్నారు. ఇంటి వద్ద ఉండే మహిళలకు, పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునే బీసీ అభ్యర్థుల కోసం ఉచిత ఆన్ లైన్ కోచింగ్ కూడా నిర్వహించామన్నారు.
'రాష్ట్ర వ్యాప్తంగా 300ల మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారు. గతేడాది ఉచిత సివిల్స్ కోచింగ్ కూడా నిర్వహించాం. సివిల్స్ కోచింగ్ తీసుకున్నవారిలో పలువురు గ్రూప్ -1, రైల్వే, బ్యాంకులు వంటి రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా వందమంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో 700ల మంది పాల్గొనగా, వారిలో వంద మంది అర్హత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన లా ఎక్స్ లెన్స్ ఐఎఎస్ అకాడమీ ద్వారా నిష్ణాతులైన అధ్యాపకులతో సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నాం.' అని మంత్రి సవిత తెలిపారు.
కార్పొరేట్ సంస్థల కంటే దీటుగా పౌష్టికాహారంతో కూడిన విద్యా బోధన అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. ఏసీ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ వంటి అధునాతన సదుపాయలు కల్పిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా వివిధ సబ్జెక్టులతో కూడిన మెటీరియల్ ను అభ్యర్థులకు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని, బీసీ అభ్యర్థులు ఐఎఎస్‌లుగా ఎంపికవ్వాలని మంత్రి సవిత సూచించారు.
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుందని, ఈ పోటీ పరీక్షకు కూడా ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి సవిత ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుని, ఐఎఎస్‌లుగా స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఎం.ఈశ్వరరావు, పేరేపి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


