AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, పూర్తి షెడ్యూ
AP EAPCET BiPC Stream Counseling : నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు ఈనెల17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.ఈ నెల 23న సీట్లను కేటాయిస్తారు.
రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు తమ నమోదు (రిజిస్ట్రేషన్) తో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు. ఈ నెల 17వ తేదీ వరకు ఇందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ కేటగిరీల ఆధారంగా ఈ నెల 23వ తేదీన సీట్లను కేటాయించనున్నారు.

ఈసారి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 ప్రవేశ పరీక్షలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో మొత్తం 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే పరీక్ష రాసిన వారిలో ఏకంగా 89.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులు. విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికన వివిధ విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తారు. అన్ని విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా ఏవైనా సీట్లు మిగిలి ఉంటే స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేస్తుంది.
కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు
- రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు నేటి(ఆగస్ట్ 12, 2026) నుంచి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
- ఆగస్ట్ 13 నుంచి 18వ తేదీ వరకు నియమిత సహాయ కేంద్రాల వద్ద • ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ఉంటుంది.
- ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థులు కోర్సులు, కళాశాలలను వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
- నమోదు చేసిన ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 20న అవకాశం ఉంటుంది.
- అభ్యర్థుల మెరిట్, కేటగిరీ ఆధారంగా ఈ నెల 23న సీట్లను కేటాయిస్తారు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేసి చేరాల్సి ఉంటుంది. మరోవైపు…. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఈ నెల 24 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత గడువు లోగా ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

