తెలంగాణ ఐటీఐ రెండో దశ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల: ఆన్‌లైన్ దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఇదే!
తెలంగాణలో రెండో దశ ఐటీఐ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మెుదటి దశలో సీటు పొందిన అభ్యర్థులు కూడా స్లైడింగ్ ద్వారా రెండో దశలో మెరుగైన సీటు సాధించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని ఐటీఐ (ITI) కళాశాలల్లో 2026-2027 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండో దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. మొదటి దశలో సీటు పొంది చేరిన విద్యార్థులు కూడా మెరుగైన ఆప్షన్లు లేదా ట్రేడ్‌ల కోసం స్లైడింగ్ విధానం ద్వారా ఈ రెండో దశలో కొత్త వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ గుర్తింపుతో సీటీఎస్ పరిధిలోని మొత్తం 47 రకాల ట్రేడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, 63 ప్రభుత్వ ఐటీఐలు, 230 ప్రైవేట్ ఐటీఐలలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ట్రేడ్‌లు
ఏటీసీలలో 6 రకాల అధునాతన కోర్సులు, సాధారణ ఐటీఐలలో 41 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫాక్చరింగ్, మెకానికల్ ఎలక్ట్రిక్ వెహికల్, సీఎన్‌సీ మెషినింగ్, ఇంజినీరింగ్ డిజైన్, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ కొత్త కోర్సులు ఉన్నాయి.
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, టర్నర్, రేడియాలజీ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, ప్లాస్టిక్ ప్రొసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, వైర్‌మ్యాన్, ఫ్యాషన్ డిజైన్, స్టెనోగ్రాఫర్, వుడ్ వర్క్ టెక్నీషియన్ తదితర కోర్ అండ్ జనరల్ ట్రేడ్‌లు ఉంటాయి.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా CBSE, ICSE, NIOS, TOSS, APOSS వంటి గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట కోర్సులకు 8వ తరగతి అర్హత సరిపోతుంది, అయితే 10వ తరగతి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి.
డ్రోన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కనీసం 16 సంవత్సరాలు ఉండాలి. ఈ అడ్మిషన్లకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://iti.telangana.gov.in ఓపెన్ చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో నమోదు చేసుకోవాలి.
పర్సనల్ డిటైల్స్, రిజర్వేషన్ వివరాలు నమోదు చేయాలి.
ఒరిజినల్ సర్టిఫికెట్లు (10వ తరగతి మెమో, కుల ధృవీకరణ పత్రం), ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
మీకు నచ్చిన ఐటీఐలు, ట్రేడ్‌లను ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లుగా నమోదు చేసుకుని, ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి.
రెండో దశ అడ్మిషన్ల ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు, వెబ్ ఆప్షన్ల నమోదు: ఆగస్టు 6 నుండి 15 వరకు జరుగుతాయి. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆగస్టు 8 నుండి 17 వరకు ఉంటుంది. సీట్ల కేటాయింపు ఆగస్టు 20 నుండి జరుగుతుంది. కళాశాలల్లో రిపోర్టింగ్ / జాయినింగ్ ఆగస్టు 21 నుండి 24 వరకు చేయాలి. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకొని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


