Tata Safari EV : టాటా నుంచి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు- సఫారీ ఈవీలో ఈ క్రేజీ ఫీచర్లు..
టాటా మోటార్స్ త్వరలో సఫారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. పండుగ సీజన్ టార్గెట్‌గా వస్తున్న ఈ ఈవీలో ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సరికొత్త హంగులతో టెక్నాలజీ ప్రియులను ఆకట్టుకునేందుకు టాటా సఫారీ ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. బ్రాండ్ నుంచి వస్తున్న తొలి త్రీ-రో (మూడు వరుసల సీట్లు) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ వాహనం రోడ్డెక్కే అవకాశం ఉంది.

తాజాగా రోడ్లపై టెస్టింగ్ జరుగుతున్న సమయంలో టాటా సఫారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా దీని డాష్‌బోర్డ్ డిజైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సియెర్రా ఈవీ తరహాలోనే సఫారీ ఈవీకి కూడా ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తాజా స్పై షాట్లు స్పష్టం చేస్తున్నాయి. హారియర్ ఈవీలో డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉండగా, సఫారీలో మాత్రం మూడు స్క్రీన్లను అమర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అత్యాధునిక ఫీచర్లతో టాటా సఫారీ ఈవీ!
ఈ ట్రిపుల్-స్క్రీన్ సెటప్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రధాన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు ముందు సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరో డిస్‌ప్లే ఉండనుంది. అయితే దీనిపై టాటా నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రధాన పోటీదారుగా ఉన్న మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ వాహనంలో కూడా ట్రిపుపుల్ స్క్రీన్ వస్తుండటంతో, టాటా కూడా ఇదే బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
హారియర్ ఈవీలో ఉన్న చాలా టెక్నాలజీ ఫీచర్లే సఫారీ ఈవీలోనూ రానున్నాయి. అయితే మూడు వరుసల సీట్ల ఎస్‌యూవీ కావడంతో దీనిని మరింత ప్రీమియమ్‌గా తీర్చిదిద్దే పనిలో పడ్డారు.
14.5 అంగుళాల శాంసంగ్ ఓఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
540 డిగ్రీల కెమెరా, డిజిటల్ ఐఆర్వీఎం
లెవల్ 2+ అడాస్, సెల్ఫ్-పార్కింగ్ ఫీచర్లు
వీ2ఎల్, వీ2వీ ఫంక్షన్ల ద్వారా బయట పరికరాలకు ఛార్జింగ్ పెట్టుకునే సౌలభ్యం
హారియర్ ఈవీ మాదిరిగానే టాటా సఫారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోనూ 65kWh, 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. డ్యూయల్-మోటర్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ మోటార్ దాదాపు 500 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. హారియర్ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 627 కి.మీ రేంజ్ ఇస్తుండగా, సఫారీ సైజు- బరువు కారణంగా దీని రేంజ్ కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
టాటా సఫారీ ఈవీ లాంచ్ ఎప్పుడు?
ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐసీఈ (పెట్రోల్/డీజిల్) సఫారీ డిజైన్‌నే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా పోలి ఉంటుంది. కాకపోతే ఈవీ అని ప్రత్యేకంగా గుర్తుపట్టేలా కొన్ని మార్పులు చేయనున్నారు. విశాలమైన క్యాబిన్, మూడో వరుస సీట్ల సౌకర్యం దీనికి ప్రధాన హైలైట్ నిలవనున్నాయి.
దీపావళి కానుకగా మార్కెట్లోకి రానున్న ఈ సఫారీ ఈవీ ఫ్యామిలీ ప్రయాణాలకను ఒక చక్కటి ఎలక్ట్రిక్ ఆప్షన్‌గా మారుతుందని ఆటోమొబైల్ నిపుణులు పేర్కొన్నారు.
"భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము," అని టాటా సఫారీ ఈవీని ఉద్దేశించి టాటా మోటార్స్ వర్గాలు స్పష్టం చేశాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


