AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే..?

AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ 2026 ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల నమోదుతో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఆగస్టు 6న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

Updated on: Jul 24, 2026, 15:39:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Counselling Web Options : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కొసాగుతోంది. ఇప్పటికే అర్హత సాధించిన విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తుండగా… వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ నమోదుతో పాటు కాలేజీ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్

జులై 31 వరకు వెబ్ ఆప్షన్లు…

  • ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు ముందుగా https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • జులై 29వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులు, అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన జులై 31వ తేదీతో ముగుస్తుంది.
  • ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జులై 31వ తేదీ వరకు తమకు ప్రాధాన్యత ఉన్న కాలేజీలు, నచ్చిన కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
  • విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇస్తే మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒకవేళ ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే… అందుకు ఆగస్టు 1వ తేదీన ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.

ఆగస్టు 6న సీట్ల కేటాయింపు, 10 నుంచి తరగతులు

విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా, వారి ఈఏపీసెట్ ర్యాంక్ మెరిట్ మరియు రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు. అలాట్ మెంట్ ఫలితాలను కూడా https://cap.apcfss.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ లోపు తమకు కేటాయించిన కళాశాలల్లో స్వయంగా హాజరై సెల్ఫ్ జాయినింగ్, రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీటును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తారు. కాబట్టి ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా కేటాయించిన సమయంలోనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక 2026-27 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్ తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More