AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి.. అలాట్‌మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

AP EAPCET 2026 Counseling : ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి అయింది. https://cap.apcfss.in/  వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందొచ్చు.

Published on: Aug 27, 2026, 15:01:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Counseling : రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'ఏపీ ఈఏపీసెట్ 2026' (AP EAPCET 2026) తుది విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసే సమయానికి రాష్ట్రంలో మొత్తం 69.42 శాతం సీట్లు భర్తీ అయ్యాయని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు.

ఏపీ ఈఏపీసెట్
ఏపీ ఈఏపీసెట్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలలో కలిపి మొత్తం 1,51,204 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 1,04,970 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ తర్వాత కూడా ఇంకా 46,234 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. అయితే ఈసారి ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పోలిస్తే, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిధిలోనే అధిక సంఖ్యలో సీట్లు మిగిలిపోవడం గమనార్హం. సీట్లు పొందిన విద్యార్థులు తమ కేటాయింపు పత్రాలను పొందేందుకు అధికారులు లాగిన్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చారు.

కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీలివే…

ఏపీ ఈఏపీసెట్ - 2026 తుది విడత కౌన్సెలింగ్‌లో సీటు సాధించిన విద్యార్థులు ఆగస్టు 27, 2026 నుంచి ఆగస్టు 31, 2026 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించి ప్రవేశాన్ని ధ్రువీకరించుకోవాలి. నిర్ణీత గడువు దాటితే సీటు రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం బోధనా తరగతులు ఆగస్టు 27, 2026 నుంచే ప్రారంభమవుతాయని విద్యాశాఖ వెల్లడించింది.

అలాట్‌మెంట్ డౌన్లోడ్ చేసుకునే విధానం :

  • మొదటగా అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'క్యాండిడేట్ లాగిన్' (Candidate Login) లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ కాగానే స్క్రీన్‌పై మీకు కేటాయించిన సీటు అలాట్‌మెంట్ లెటర్ కనిపిస్తుంది.
  • ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి.
  • అడ్మిషన్ల ప్రక్రియలో అలాట్ మెంట్ చాలా కీలకం.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More