...
...
Next Story

AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్ 2026 ఎంపీసీ స్ట్రీమ్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈనెల 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Sep 9, 2026, 05:12:14 IST
Advertisement

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఎంపీసీ విభాగానికి సంబంధించి మూడో విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cap.apcfss.in ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్
ఏపీ ఈఏపీసెట్

తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు కేటాయించిన తేదీల్లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదును పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి, రెండో విడతలో సీటు దక్కని అభ్యర్థులతో పాటు మరో అవకాశం కోసం ఎదురుచూసే అభ్యర్థులు కూడా ఈ ఫేజ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 11 వరకు అవకాశం ఉంటుంది. ఈనెల 9వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 16వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

ఏపీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ - ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: 09.09.2026 నుండి 11.09.2026 వరకు
  • సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన (HLCలు) : 09.09.2026 నుండి 12.09.2026 వరకు అవకాశం ఉంటుంది.
  • వెబ్ ఆప్షన్ల నమోదు: 09.09.2026 నుండి 12.09.2026 వరకు
  • వెబ్ ఆప్షన్ల మార్పు : 13.09.2026
  • సీట్ల కేటాయింపు: 16.09.2026
  • సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలల్లో రిపోర్టింగ్: 16.09.2026 నుండి 19.09.2026 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks