AP PGCET 2026 : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే

AP PGCET 2026 Counseling : ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP PGCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 8 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. 

Updated on: Sep 5, 2026, 16:58:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP PGCET 2026 Counseling : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఏపీ పీజీసెట్ 2026' (AP PGCET) మొదటి విడత ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2026
ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ 2026

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీలు, అలాగే ప్రైవేట్ వర్సిటీలలో అందుబాటులో ఉన్న ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో సీట్ల కేటాయింపు కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, అలాగే నిర్ణీత విద్యార్హత నిబంధనల ప్రకారం ఉత్తీర్ణులైన వారు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే అధికారిక పోర్టల్ సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ తేదీలు :

  • విద్యార్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : సెప్టెంబర్ 8, 2026 వరకు అవకాశం ఉంటుంది.
  • ఆన్‌లైన్ ప్రమాణపత్రాల పరిశీలన : సెప్టెంబర్ 4, 2026 నుండి సెప్టెంబర్ 12, 2026 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
  • ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల వెరిఫికేషన్ : సెప్టెంబర్ 9, 2026న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు : సెప్టెంబర్ 11, 2026 నుండి సెప్టెంబర్ 15, 2026 వరకు విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల సవరణ : సెప్టెంబర్ 16, 2026న ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు.
  • సీట్ల కేటాయింపు : సెప్టెంబర్ 21, 2026న కేటాయించిన సీట్ల వివరాలను ప్రకటిస్తారు.
  • కళాశాలల్లో రిపోర్టింగ్ : సీటు సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 22 వరకు సంబంధిత కాలేజీల్లో నివేదించాల్సి ఉంటుంది.
  • తరగతుల ప్రారంభం : సెప్టెంబర్ 21, 2026 నుండి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక పీజీసెట్ లో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మొదటి విడత పూర్తి అయిన తర్వాత… మరో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలవుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More