...
...
Next Story

AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ - నేటితో ముగియనున్న రిజిస్ట్రేషన్లు! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌ ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది.ఈనెల 26న సీట్లను కేటాయిస్తారు.

Published on: Aug 20, 2026, 11:39:13 IST
Advertisement

AP EAPCET 2026 Final Phase Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2026) ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులకు నిర్ణయించిన గడువు నేటితో (ఆగస్టు 20) ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ సూచించారు.

ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22, 2026 వరకు తమకు కావాల్సిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లు ఎంచుకోవచ్చు. నమోదు చేసుకున్న ఆప్షన్లను సవరించుకోవడానికి ఆగస్టు 23, 2026న ఒక రోజు అవకాశం ఉంటుంది. తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 26, 2026న ప్రకటిస్తారు.

ముఖ్యమైన తేదీలు - కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్:

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఆగస్టు 20, 2026 వరకు అవకాశం ఉంటుంది.
  • హెల్ప్ లైన్ సెంటర్లలో డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఆగస్టు 21, 2026 నాటికి పూర్తి చేస్తారు.
  • వెబ్ ఆప్షన్ల నమోదు: అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22, 2026 వరకు తమకు కావలసిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల మార్పులు (సరిదిద్దుకోవడం): నమోదు చేసుకున్న ఆప్షన్లను సవరించుకోవడానికి ఆగస్టు 23, 2026న ఒక రోజు అవకాశం ఇస్తారు.
  • సీట్ల కేటాయింపు : ఏపీ ఈఏపీసెట్ తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఆగస్టు 26, 2026న అధికారికంగా ప్రకటిస్తారు.
  • కాలేజీల్లో రిపోర్టింగ్ : సీటు సాధించిన విద్యార్థులు ఆగస్టు 27, 2026 నుంచి ఆగస్టు 31, 2026 మధ్య ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
  • తరగతుల ప్రారంభం : ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ఆగస్టు 27, 2026 నుంచి ప్రారంభమవుతాయి.
  • అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe