AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్ అప్డేట్ - 'మాక్ టెస్టులు' ప్రారంభం, ఇవిగో డైరెక్ట్ లింక్స్
ఏపీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. మాక్ టెస్ట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఉచితంగా ఈ పరీక్షలను రాసుకోవచ్చు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ పరీక్ష - 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇదిలా ఉంటే అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా మాక్ టెస్టులనూ అందుబాటులో తీసుకువచ్చారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్ అభ్యర్థులు వీటిని ఉచితంగా రాసుకోవచ్చు.

AP EAPCET 2026 మాక్ టెస్టులు - ఇలా రాయండి
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని మాక్ టెస్ట్ లింక్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఇంజినీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ ఆప్షన్ కనిపిస్తాయి.
- మీరు ఏ పరీక్షకు అర్హులవుతారో ఆ స్ట్రీమ్ లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సైన్ ఇన్ కావాలి.
- ఇక్కడ ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. 160 ప్రశ్నలుంటాయి.
- ఈ పరీక్షలను ఉచితంగా ఎన్ని సార్లు అయినా రాసుకునే వీలుంటుంది.
ఈ మాక్ టెస్టులు రాయటం వల్ల అభ్యర్థులకు చాలా ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా ప్రశ్నల సరళి, సమయాభావంతో పాటు ఇతర విషయాలపట్ల ఓ అవగాహనకు రావొచ్చు. వీలైనన్నీ ఎక్కవ మాక్ టెస్టులు రాయటం వల్ల విద్యార్థులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
AP EAPCET 2026 - ముఖ్యమైన తేదీలు
- ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు చివరి తేదీ - 07-03-2026.
- రూ. 1000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 12-03-2026.
- రూ. 2000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ -17-03-2026
- రూ. 4000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 21-03-2026.
- రూ. 10,000 ఫైన్ తో దరఖాస్తులకు చివరి తేదీ - 26-03-2026 .
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 26-03-2026 నుంచి 28-03-2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ - 28-04-2026 .
- ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష - 12-05-2026 నుంచి 15-05-2026 వరకు, మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి.
- అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు - 19-05-2026 నుంచి 20-05-2026 .
- అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ విడుదల - 23-05-2026 .
- అభ్యంతరాల స్వీకరణ - 25-05-2025.
- ప్రాథమికంగా ఫలితాలు ప్రకటించే తేదీ - 01-06-2026 .
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఈఏపీసెట్ - 2026 ఇంజినీరింగ్ స్ట్రీమ్ మాక్ టెస్టులు రాయవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

