AP EAPCET 2026 ఫలితాలు వాయిదా.. జులై 2న విడుదల

AP EAPCET 2026 Results : ఏపీ ఈఏపీసెట్ (EAPCET) 2026 ఫలితాలు విడుదల వాయిదా పడ్డాయి. ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/  వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు.

Published on: Jun 30, 2026, 11:18:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Results : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి. రాష్ట్ర విద్యా, సమాచార సాంకేతిక (IT) శాఖల మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. కానీ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు. ఈఏపీసెట్ జులై 2వ తేదీన విడదల చేయనున్నారు.

ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు

AP EAPCET ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలి?

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందొచ్చు.

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. హాయ్ అనే మేసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.

ఏపీ ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ర్యాంకుల విడుదల తర్వాత….. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తుంది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.

ఏపీ ఈఏపీసెట్ 2026 హాజరు గణాంకాలు:

ఏపీ ఈఏపీసెట్ - 2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తంగా 92.60 శాతం హాజరు నమోదైంది.

  • ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC స్ట్రీమ్): ఈ విభాగానికి అత్యధికంగా 2,76,576 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,58,545 మంది పరీక్ష రాశారు. ఈ విభాగంలో అత్యధికంగా 93.48 శాతం హాజరు రికార్డయ్యింది.
  • వ్యవసాయ, ఫార్మసీ (BiPC స్ట్రీమ్): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి మొత్తం 79,227 మంది దరఖాస్తు చేసుకోగా.. 70,929 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ స్ట్రీమ్‌లో 89.53 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈఏపీసెట్ 2026 లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత….. సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. విడతల వారీగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే, వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేస్తుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More