AP EAPCET Results 2026: జూన్ 30న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోవాలి

AP EAPCET Results 2026 : ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 30వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ మెుదలుకానుంది.

Published on: Jun 28, 2026, 18:36:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్-2026 (AP EAPCET) ఫలితాల విడుదలకు తేదీ సిద్ధంగా ఉంది. దాదాపు 3.29 లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈ నెల 30న (మంగళవారం) ఉదయం విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి సర్వం సిద్ధం చేసింది.

ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలపై అప్డేట్
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలపై అప్డేట్

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్, ఎప్‌సెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్కే ప్రసాద్ ధృవీకరించారు. అయితే ఫలితాలు విడుదలయ్యే కచ్చితమైన సమయాన్ని (టైమింగ్స్) అధికారులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.

వాస్తవానికి ఈఏపీసెట్ షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఫలితాలు రావాల్సి ఉంది. కానీ నెల రోజులు ఆలస్యం కావడానికి బలమైన కారణం ఉంది. ఏపీ ఎప్‌సెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు, అలాగే సీబీఎస్‌ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు ఫలితాల ప్రకటనను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ డేటా అంతా ఎక్సైజ్ కావడం, సీబీఎస్‌ఈ రివైజ్డ్ ప్రక్రియ ముగియడంతో జూన్ 30న ఫైనల్ ర్యాంకులను విడుదల చేస్తున్నారు.

మే 12 నుండి మే 20 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగాయి. సుమారు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ + ఎప్‌సెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఆధారంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులను కేటాయిస్తారు.

ఫలితాలను చెక్ చేసుకోవడం ఎలా?

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల కోసం భక్తులు/విద్యార్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఫలితాల ప్రకటన అనంతరం జూలై మొదటి లేదా రెండో వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ (AP EAPCET Counselling 2026) ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More