AP EAPCET 2026 : ఏపీ ఈఏపీసెట్ అభ్యర్థులకు కొత్త అప్డేట్ - ఎడిట్ ఆప్షన్ వచ్చేసింది..! వెంటనే ప్రాసెస్ చేసుకోండి
AP EAPCET edit option 2026 : ఏపీఈఏపీసెట్ అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
AP EAPCET edit option 2026 :రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశం ఏప్రిల్ 13వ తేదీతో ముగుస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో తెలియక చేసిన పొరపాట్లను 'ఎడిట్ ఆప్షన్' తో సరిదిద్దుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. కేటగిరి 2 కరెక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ దరఖాస్తుల్లోని వివరాలను సవరించుకోవడానికి రెండు రకాల కేటగిరీలుంటాయి. వీటిలో కొన్నింటిని అభ్యర్థులు నేరుగా మార్చుకోవచ్చు, మరికొన్నింటికి అధికారుల అనుమతి తప్పనిసరి.
కేటగిరీ-1: అధికారులు మాత్రమే మార్చే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరిలోని వివరాల కోసం helpdeskapeapcet@apsche.org ఈమెయిల్ ఐడికి తగిన డాక్యుమెంట్లను జత చేస్తూ మెయిల్ పంపాలి.మార్పులు చేసే అంశాలు మరియు జత చేయాల్సిన పత్రాలు ఉండాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వాటిమార్పు కోసం ఎస్ఎస్‌సీ (SSC) మార్కుల జాబితాను సమర్పించాలి. స్కాన్ చేసిన సంతకం కాపీని పంపాలి. స్కాన్ చేసిన కొత్త ఫోటోను జత చేయాలి.
కేటగిరీ-2 కింద ఉన్న వివరాలను అభ్యర్థులు నిర్ణీత గడువులోగా వెబ్‌సైట్ ద్వారా స్వయంగా సవరించుకోవచ్చు. ఈ సదుపాయం ఏప్రిల్ 13, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. క్వాలిఫైయింగ్ పరీక్ష ఉత్తీర్ణత సంవత్సరం, బోధనా మాధ్యమం (మీడియం), లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీ/నాన్-మైనారిటీ హోదా, తల్లి పేరు, లింగం (Gender), ఆధార్ కార్డ్ వంటి వివరాలను అభ్యర్థులే ఎడిట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం, ప్రత్యేక కేటగిరీ వివరాలు, ఇంటర్మీడియట్ లేదా బ్రిడ్జ్ కోర్సు హాల్ టికెట్ నంబర్, చదివిన ప్రాంతం, ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్, ఉత్తీర్ణత సంవత్సరం వంటి వివరాలు కూడా కేటగిరి 2 కింద ఉన్నాయి.
ఈనెల 28న హాల్ టికెట్లు :
ఏప్రిల్ 28వ తేదీన ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 12వ తేదీ నుంచి 15 వరకు వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహిస్తారు.మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 19న ప్రారంభమై…20వ తేదో పూర్తవుతాయి. జూన్ 1వ తేదీన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంటుంది.
ఏపీ ఈఏపీసెట్ - 2026 నిర్వహించిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ర్యాంకులను వెల్లడిస్తారు. విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే…. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

